English
Download App from store
author
బివిడి ప్రసాదరావు
రైటర్, బ్లాగర్, వ్లాగర్ ని. నా బ్లాగు - BVD Prasada Rao Blog (https://bvdprasadarao-pvp.blogspot.com) నా యూట్యూబ్ ఛానల్ - BVD Prasada Rao Vlog (https://youtube.com/బివిడి ప్రసాదరావు)
user
బివిడి ప్రసాదరావు
అ(బొ)మ్మ (సరళము కథ)
  55 Views
 
  2 Mins Read
 
  5

రా

జు షాపుకు వెళ్లాను. అతడు, నేను బి.కాం. చేశాం. నాకు ఒక ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అతడు ఉద్యోగం రాక బ్యాంక్ లోన్ తో 'బేబీ గుడ్స్ షాప్' పెట్టాడు. రోజూ సాయంకాలం వేళ, అతడి షాపు కెళ్లి, కొంత సేపు వాడితో కలిసి ఉంటాను. రాజు కౌంటర్ లో ఉన్నాడు. పలకరింపుగా నన్ను చూసి నవ్వేశాడు. వాడికి ఎదురుగా స్టూల్ మీద కూర్చున్నాను. ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. అంతలోనే, ఒక కారు వచ్చి, షాపు ముందు ఆగింది. ఇద్దరం ఒకే మారు అటు చూశాం. ఆ కారులో నించి ఒకావిడ దిగింది. ఆమె వాటంబట్టి ఆవిడ గొప్పింటి మనిషిలా తోచింది. ఆవిడ వెంట ఒక సాధారణ మనిషి దిగింది. ఆమె చేతిలో రబ్బరు బొమ్మలాంటి బిడ్డ ఉంది. బహుశా ఆ మనిషి ఆయా లేదా పనిమనిషి కావచ్చు. ఆ ఇద్దరూ షాపులోకి వచ్చారు. సహజంగా అటువంటి కష్టమర్ వచ్చినప్పుడు షాపు యజమాని రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. రాజు లేచి, "రండి మేడమ్" అంటూ ఆవిడను ఆహ్వానించాడు. ఆవిడ ఏదో అడిగింది. అవి చూపించమని సేల్స్ గర్ల్స్ ను పురమాయించాడు రాజు, హడావిడిగా. తనకు కావలసినవి అడిగి చూస్తోందావిడ. సహనంతో సేల్స్ గర్ల్స్ ఆవిడకు సహాయ పడుతున్నారు. అప్పుడే బయట గోలగా అనిపిస్తే, నేను అటు చూశాను. ఒక చిన్న బిడ్డ ఏడుస్తోంది. ఆ బిడ్డను ఎత్తుకున్న ఆసామీ ఆ బిడ్డను ఓదార్చ డానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ బిడ్డకు షాపు షోకేస్ లో బయటకు అగు పిస్తున్నబొమ్మలు చూపిస్తూ. ఆ బిడ్డ ఏడుపు ఆపడం లేదు. ఆ షాపు ముందు ఆ గలాభాకు షాపులోని వారంతా పనులు ఆపి అటే చూస్తున్నారు. ఆ గొప్పింటావిడ షాపులో అటూ ఇటూ కదులుతోంది. "ఆయా, పాపను ఇలా తీసుకురా" అంది అంతలోనే ఆవిడ, దర్పంగా. ఆ ఆయా ఆవిడ చెంతకు వెళ్లింది. "పాపా, ఈ బొమ్మ కావాలా?" అనడిగిందావిడ, తన చేతిలోని బొమ్మను పాపకు చూపుతూ. ఆ పాప ఆ బొమ్మను అమాంతంగా లాక్కుంది. "ప్రసాద్, వాళ్లను పొమ్మను. కొనలేరు, పిల్లలకు మాత్రం ఆ బొమ్మలు చూపించి, ఏడిపిస్తారాయే. కల్చర్ లెస్ బ్రూట్స్." అనేశాడు రాజు, అసహనంగా, నాతో. నేను అటు కదిలాను. వాళ్లను వెళ్లమన్నాను. వాళ్లు ఇంకా కదలడం లేదు. ఆ బిడ్డ ఏడుస్తూనే ఉంది. "ఈ బొమ్మ ఎంత" అడిగాడు ఆ బిడ్డను ఎత్తుకున్న అతడు, నన్ను. ఆ బొమ్మను చూసి, రాజు వద్దకు వచ్చి, దానిని చూపిస్తూ 'ఖరీదు' అడిగాను. "వాడేం కొంటాడు. పొమ్మను. రాని బేరం." అన్నాడు రాజు, చిరాగ్గా. ఆ బిడ్డ ఏడుస్తూనే ఉంది. అప్పుడే ఆ గొప్పింటావిడ - "ఆ బొమ్మ ఖరీదు ఎంతో చెప్పవచ్చుగా" అంది, రాజుతో. "లేదు మేడమ్. వాళ్ల మొహం, వాళ్ల వాలకం చూశారా, కొనేది లేదు, టైం వేస్ట్." అన్నాడు రాజు, చిరాకుగా. "సర్లే. నాకు కావాలి, ఎంతో చెప్పండి." అంది ఆవిడ. రాజు చెప్పాడు. బయట బిడ్డ ఏడుస్తూనే ఉంది. "అది ఇవ్వండి" అంది ఆవిడ. సేల్స్ గర్ల్ తో తీయించి, తెప్పించాడు రాజు, ఆ బొమ్మను. ఆవిడ ఆ బొమ్మను తీసుకొని, ఏడుస్తూన్న ఆ బిడ్డ వైపు కదిలింది. ఆ బిడ్డ చేతిలో ఆ బొమ్మ పెట్టింది. ఆ బిడ్డ ఆ బొమ్మతో ఆడుకుంటూ ఏడుపు ఆపేసింది. "అమ్మా, ఎంతమ్మా." అడిగాడు ఆ బిడ్డను ఎత్తుకున్నతను. "నీ దగ్గర ఎంత ఉంది?" అడిగింది ఆవిడ. "పాతిక" చెప్పాడతను. "పదిహేను రూపాయలు" చెప్పింది ఆవిడ. "తగ్గదమ్మా" అడిగాడతను. "ఎంతిస్తావు" - ఆవిడ. "పది" - అతను. "ఇవ్వు" అంది ఆవిడ, టక్కున. తర్వాత - రాజుకు ఆ పది నోటు ఇస్తూ, "మిగతాది నా బిల్లులో చూపించు" అంది ఆవిడ. ఆ బొమ్మ ఖరీదు అక్షరాలా నాలుగు వందల రూపాయలు. ***

© All rights reserved


Did you enjoy reading this story? Even you can write such stories, build followers and earn. Click on WRITE below to start.

(*)star-filled(*)star-filled(*)star-filled(*)star-filled(*)star-filled
Comments (5)